ఈ నెల 6న నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నెల 6న మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈమేరకు జలమండలి అధికారులు ప్రకటనలో తెలిపారు. తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్‌కు మరమతులు చేపట్టడంతో సోమవారం ఉదయం 6గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు పనులు కొనసాగనున్నాయి. దీంతో 24 గంటలు మంచినీటి సరఫరా నిలిపి వేయబడుతుంది. కావున ఈ 24 గంటలు కింద పేర్కొన్న ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో పూర్తిగా అంతరాయం.. మరి కొన్ని చోట్ల లో-ప్రెజర్ తో నీటి సరఫరా జరుగుతుంది. కావున అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని వినియోగదారులు తాగునీటిని పొదుపుగా వినియోగించుకోగలరని కోరడమైనది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియా, హెచ్ సీయూ, బీహెచ్ఈఎల్ టౌన్ షిప్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ, ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్, డోయెన్స్ కాలనీ, హఫీజ్ పేట్, మదీనాగూడ, గంగారం, చందానగర్, లింగంపల్లి, జ్యోతి నగర్, అశోక్ నగర్, ఆర్సీ పురం, పటాన్ చెరు.