Balapur: రూ.25 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 25 లక్షల నకిలి నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలాపూర్ పిఎస్ పిరధిలో మహేశ్వరం ఎస్ ఒటి పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. రూ. 25 లక్షల నకిలీ కరెన్సీని గుర్తించారు. వాటిని మహారాష్ట్ర నుండి తీసుకొచ్చినట్లు సమాచారం. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.