Hyderabad: రూ.1.30 లక్ష‌లు దాటిన ప‌సిడి

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్‌లో బంగారం కొండెక్కి కూర్చుంది. సామాన్యుడికి అంద‌నంత ఎత్తులో దూసుకెళ్తోంది. భార‌త్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు చుక్క‌ల‌ను తాకుతోంది. ఇవాళ హైద‌రాబాద్‌లో రూ. 130 ల‌క్ష‌లు దాటిపోయింది.

న‌గ‌రంలో మంగ‌ళ‌వారం 24 క్యార‌ట్ల 10 బంగారం రూ.1,30,850 ఆల్‌టైమ్ రికార్డు ధ‌ర ప‌లుకుతోంది. అదే 22 క్యార‌ట్ల ధ‌ర రూ. 1,17,780 గా ఉంది. మిగ‌తా తెలంగాణ‌తో పాటు ఎపిలో ప‌లు ప్రాంతాల్లో బంగారం దాదాపు రూ. 130 లక్ష‌ల‌కు ద‌గ్గ‌ర‌లోనే ఉంది.

మ‌రో వైపు బంగారం వెంగా మారుతోంది. రాను రాను వెండి ధ‌ర‌లు కూడా ఆకాశ‌న్నంటుతున్నాయి. హైద‌రాబాద్ మార్కెట్లో కిలో వెండి ధ‌ర రూ. 1,85,763 ప‌లుకుతోంది.

Also Read: Hyderabad: ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌హిళ‌

Leave A Reply

Your email address will not be published.