Hyderabad: 19,20 తేదీల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది. 19వ తేదీ ఉదయం 6 గంటల నుండి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు.. మొత్తం 30 గంటలు పాక్షికంగా, పలు ప్రాంతాల్లో పూర్తిగి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. మంజీరా వాటర్ సప్లై ఫేజ్ – 2 లో కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు, పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు గల 1500 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఆర్ అండ్ బీ శాఖ బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్ పనులు చేపడుతున్నారు.
ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్ లలో పాక్షికంగా మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.
కెపిహెచ్‌బి కాలని, కూకట్ పల్లి, ముసాపేట్, జగద్గిరి గుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్ జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్ , గంగారాం, దీప్తి శ్రీ నగర్, మదీనా గూడ, మియాపూర్, బీరం గూడ, అమీన్ పూర్ ప్రాంతాల్లో పూర్తిగా అతరాయం కలుగుతుంది. కావును నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు ప్రకటనలో తెలిపారు.