మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి: మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ (CLiC2NEWS): వర్గీకరణ అంశంపై సిఎం తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఎమ్ ఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్‌సి వర్గీకరణ అమలు చేసే విషయంలో రాష్ట్రం ముందుంటుందని అన్ని సిఎం.. అమలు విషయంలో జాప్యం చేస్తున్నారని అన్నారు.
నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మరో ఉద్యమానికి మాదిగ, ఉపకులాలు సిధ్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్ వర్గీకరణ అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మాదిగలపై రేవంత్‌వి తేనె పూసిన మాటలని, నమ్మించడంలో ఘనుడని అన్నారు.. వర్గీకరణ అంశంపై సిఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అన్నారు. ఎస్ వర్గీకరణ విషయంలో పంజాబ్, తమిళనాడు తొలి వరపలో నిలిచాయని తెలిపారు. ముందు అమలు చేస్తామన్న సిఎం మాటలకు విలువ లేకుండా పోయిందని అన్నారు.