మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సు
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని నిమ్స్ హాస్పిటల్.. ఈ ఏడాదికి మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సుకు సంబంధించి 20 సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ మేరకు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగం హెచ్ ఒడి, మెడికల్ సూపరింటెండెంట్ డా. నిమ్మ సత్యనారాయణ, కోర్సు అకడమిక్ ఇన్‌ఛార్జి డా. మార్త రమేశ్ మీడియాకు వివరించారు. దేశంలోనే ఎంహెచ్ఎం కోర్సు ఒక్క నిమ్స్ వైద్య విద్యా సంస్థలో మాత్రమే అందిస్తుందని తెలిపారు. నిమ్స్‌లో ఇప్పటి వరకు ఈ కోర్సు 19 ఏళ్లు పూర్తిచేసుకుందని, ఈ ఏడాది 20వ సంవత్సరమని.. 20 సీట్లకు దరఖాస్తులకు కోరుతున్నట్లు తెలిపారు. ఈ కోర్సు రెండున్నరేళ్ల వ్వవధి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్నవారికి దేశ, విదేశాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
ఎంహెచ్ఎం కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు 30 సంవత్సరాల లోపు ఉండాలి. వంద శాతం ఫీజు రీయంబర్స్‌మెంట్ ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు
www.nims.edu.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని తెలిపారు.