డిఎస్‌సిని వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో డిఎస్‌సి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డిఎస్‌సి పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ లకిడికాపూల్‌లోని పాఠశాల విద్యాకమిషనర్ కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వరుసగా పోటి పరీక్షలు ఉండటంతో చదవడానికి సమయం లేదని.. అంతే కాక, టెట్‌కు, డిఎస్‌సికి భిన్నమైన సిలబస్ ఉండటంతో సమయం పడుతోందని పేర్కొన్నారు. టెట్ ఫలితాలు విడుదలైన కారణంగా కొంత కాలం డిఎస్‌సిని వాయిదా వేయాలని అభ్యర్థుల విజ్ఞప్తి చేస్తున్నారు.