రాష్ట్రంలో అకాల వర్షాలు.. ఓ ఇంటిపై పడిన పిడుగు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. నిజామాబాద్ ధర్పల్లి లోని వాడి గ్రామంలో దడగళ్ల వాన పడింది. మెదక్ పట్టణంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఇంట్లో మనుషులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మెదక్ , పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు , మెరుపులతో కూడిని వర్షాలు కురిశాయి. దీంతో మామిడి కాయలు రాలిపోయినట్లు సామాచారం. కరీంనగర్‌లోని చొప్పదండి మార్కెట్‌లో మొక్కజొన్న తడిసిపోయింది.