Hyderabad: ఆరు బైక్‌ల‌ను ఢీకొట్టి, టైల‌ర్ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

హైద‌రాబాద్ (CLiC2NEWS): మితి మీరిన వేగ‌మో.. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్య‌మో కానీ.. న‌గ‌రంలోని అంబ‌ర్ పేట ప్ర‌ధాన ర‌హ‌దారిపై కారు బీభ‌త్సం సృష్టించింది. అంబ‌ర్‌పేట కొత్త ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిపై ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పి.. ర‌హ‌దారి ప‌క్క‌నే ఉన్న ఆరు బైక్‌ల‌ను ఢీకొట్టింది. అనంత‌రం ఓ టైల‌ర్ దుకాణంలోకి దూసుకుపోయింది. హైటెక్ సిటి నుండి రామాంత‌పూర్‌కు వ‌స్తున్న కారు అదుపుతప్పి బైక్‌ల‌ను ఢీకొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఉన్న ముగ్గురు వ్య‌క్తుల‌కు స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌ధాన ర‌హ‌దారిపై రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్పడింది.

Leave A Reply

Your email address will not be published.