కలహాలు మాని.. కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/09/Revanth.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కలహాలు మాని అందరూ కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను పిసిసి పదవిని సైతం వీడేందుకు కూడా సిద్ధమని రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ ఎస్ ప్రజలను మాయ చేస్తున్నదని.. వీటిని ప్రజలకు తెలిపేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు చేయిచేయి కలపాలని అన్నారు.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రంలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ నిర్వహించనున్నారు. దీని ప్రణాళికపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీకోసం పదవులను, ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపార్టీలో ఉన్న కెసిఆర్‌కు వ్యతిరేకంగా పోరాడానని..వందపైగా కేసులు పెట్టినా భయపడనని అన్నారు. ఏనాడూ కెసిఆర్ నీడను కూడా తాకలేదని.. పార్టీ శ్రేయస్సుకోసం అధిష్ఠానం ఏనిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని పేర్కొన్నారు.