Hyderabad:  హౌవార్డ్ టాలెంట్ స్కూల్‌లో ఆక‌ట్టుకున్న సైన్స్ ఫేర్

హైదరాబాద్‌ (CLiC2NEWS): మార్కులు, ర్యాంకుల కోస‌మే కాదు.. సొంత ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెడుతున్నామంటున్నారు… నేటి త‌రం బాల‌లు… చిట్టి మెద‌ళ్ల‌కు గ‌ట్టి ప‌ని చెబుతూ స‌మాజం ఎదుర్కొంటున్న గ‌ట్టి స‌వాళ్ల‌కు ప‌రిష్కారం చూపుతున్నారు. హైద‌రాబాద్‌లోని హౌవార్డ్ టాలెంట్ స్కూల్‌లో శ‌నివారం జ‌రిగిన సైన్స్ ఫేర్ లో విద్యార్థిని విద్యార్థులు ర‌క‌ర‌కాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.
ఈ సైన్స్ ఫేర్‌లో పాఠ‌శాల‌లోని 1వ త‌ర‌గ‌తి నుండి 10వ త‌ర‌గతి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఈ సైన్స్ ఎగ్జిబిష‌న్‌ను ఆస‌క్తిగా తిల‌కించారు. విద్యార్థులు తాము త‌యారు చేసిన వాటి గురించి వీక్ష‌కుల‌కు, పేరెంట్స్‌కు వివ‌రించారు. విద్యార్థులు అన్ని స‌బ్జెక్టుల‌కు సంబంధించిన విభాగాల‌లో ఉపాధ్యాయుల స‌హాయ‌ స‌హాకారాల‌తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. విద్యార్థుల‌లో ఉన్న సృజ‌నాత్మ‌క‌త‌కు మెరుగుపెట్టేందుకు ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు దోహ‌ద‌ప‌డుతాయ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు.

 

Leave A Reply

Your email address will not be published.