హైద‌రాబాద్‌లో సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ రూ. 13-18 ల‌క్ష‌లే..

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని బండ్ల‌గూడ‌, పోచారంలో రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్ల లాట‌రీకి సంబంధించి హెచ్ ఎండిఎ మ‌రోసారి లాట‌రీ వేయ‌నున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ చేసుకున్న ద‌ర‌ఖాస్తుదారులు ఫ్లాట్ల‌ను సొంతం చేసుకొనేందుకు వీలు క‌ల్పించింది. రెండు ప్రాంతాల‌లో సుమారు 3,700 ఫ్లాట్లు ఉండ‌గా.. వీటిలో 40% మాత్ర‌మే లాట‌రీ ద్వారా విక్ర‌యించారు. ఈ ఫ్లాట్ల‌ను లాట‌రీ ద్వారా ద‌క్కించుకున్న వారు కూడా డ‌బ్బులు చెల్లించేంద‌కు ముందుకు రాక‌పోవ‌డంతో., చాలా వ‌ర‌కు ఫ్లాట్లు మిగిపోయాయి. ఇలా మిగిలిన వాటిని మ‌రోసారి లాట‌రీ వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్లు సింగిల్ బెడ్ రూం ఫ్లాటు రూ. 13-18 ల‌క్ష‌లు, 3బిహెచ్‌కే ఫ్లాటు రూ. 50-60 ల‌క్ష‌లుగా ఉంది.

1 Comment
  1. gate.io closing says

    Excellent article. Keep posting such kind of information on your blog.Im really impressed by it.Hi there,You have done a fantastic job. I’ll definitely digg it and individually recommend to my friends.I am sure they’ll be benefited from this web site.My webpage … daftar slot online

Your email address will not be published.