ఈ నెల 11న న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఈ నెల 11 వ తేదీ శ‌నివారం న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో మంచినీ టి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది.ఈ మేర‌కు జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఫోర్ బే, మిరాలం ఫిల్టర్ బెడ్స్ సెట్లింగ్ ట్యాంకులు, ఇన్ లెట్ ఛానళ్లను శుభ్రం చేయనున్న నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతుంది. శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల నుండి ఆదివారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు హ‌స‌న్ న‌గ‌ర్, కిష‌న్ బాగ్, దూద్ బౌలి, మిస్రిగంజ్, ప‌త్త‌ర్ గ‌ట్టి, దారుల్ షిఫా, మొఘ‌ల్ పురా, జహానుమా, చందూలాల్ బ‌రాద‌రి, ఫ‌ల‌క్ నుమా, జంగంమెట్ ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌బ‌డుతుంది. కావున 24 గంటల పాటు నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని కోరుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.