ప్రతి సోమవారం నగర ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ
హైదరాబాద్ (CLiC2NEWS): నగర ప్రజల నుండి ప్రతి సోమవారం ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రజలు సందేహాలు ఏమైనా ఉంటే 040-29560596, 040-29565758 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.