నేనే అఫ్ఘానిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిని: ప్ర‌క‌టించుకున్న‌ సలేహ్

కాబుల్ (CLiC2NEWS): తాలిబ‌న్లు అఫ్ఘానిస్థాన్‌ను కైవ‌సం చేసుకున్న త‌ర్వాత అక్క‌డ చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు భీతికొల్ప‌డంతో పాటు ఉత్కంఠ రేపుతున్నాయి. అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ దేశం విడిచి పారిపోవ‌డంతో ఆప‌ద్ధ‌ర్మ అధ్య‌క్షుడిని నేనే అంటూ ఆ దేశ తొలి ఉపాధ్య‌క్షుడు అమ్ర‌ల్లా స‌లేహ్ ప్ర‌క‌టించుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్‌ చేశారు.

“అఫ్గాన్ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు మరణించినా, లేన‌ప్ప‌డు ఉపాధ్యక్షుడే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఉంటారు. నేను ఇప్పుడు అఫ్ఘానిస్థాన్‌లోనే ఉన్నా. చట్టబద్ధంగా నేనే ఆపద్ధర్మ అధ్యక్షుడిని. అందరి మద్దతు కూడబెట్టేందుకు ప‌లువురు నేతలను కలుస్తున్నాను.“ అని ట్విట్ట‌ర్‌లో అమ్రుల్లా సలేహ్ పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.