ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయను: బాబుమోహన్

హైదరాబాద్ (CLiC2NEWS): ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటంలేదని బిజెపి నేత బాబూ మోహన్ తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబూమోహన్ మాట్లాడారు. ఎన్నికల్లో తాను పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తన కుమారిడికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి.. తండ్ర కొడుకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. అర్హులకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నానన్నారు. పార్టీలో తనకు చాలా అవమానాలు జరిగాయని.. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తన ఫోన్ కాల్ లిప్టు చేయరన్నారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని.. తనను కావాలనే దూరం పెట్టారని బాబూమోహన్ తెలిపారు.