నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా..

ఢిల్లీ (CLiC2NEWS): నీటి వృథాను అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ. 2000 జరిమానా విధించనున్నట్లు సమాచారం. నగరంలో ఎండల తీవ్రత, పలుచోట్ల తాగునీటి కొరత వంటి పరిస్థితుల్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయిం తీసుకున్నట్లు మంత్రి అతిశీ తెలిపారు. దీనికోసం ఢిల్లీ వ్యాప్తంగా 200 బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మే 30 నుండి బృందాల్ని రంగంలోకి దించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ జల్ బోర్డు సిఇఒ లేఖ రాశారు.
నీటి పైపులతో కార్లను కడగడం, వాటర్ ట్యాంకర్లు ఓవర్ ఫ్లో కావడం, వాడుక నీటిని నిర్మాణ , వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నిర్మాణ స్థలాలు, వాణిజ్య సంస్థల్లో ఏవైనా అక్రమ నీటి కనెక్షన్లు ఉంటే తొలగించాలని ఆదేశించారు.