ముఖంపై మొటిమ‌లు మాయం కావాలంటే..

సౌందర్యపరంగా అమ్మాయిలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో `మొటిమలు` ముందు వరుసలో ఉంటాయి. అయితే ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండచ్చు. కొందరికి ఇవి మరీ అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా కాస్త పెద్ద పరిమాణంలో ఉంటూ నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. ఇంకొందరికి కాస్త తక్కువ సంఖ్యలోనే ఉంటాయి. అయితే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం ద్వారా వీటి నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందచ్చు.

అంద‌మైన ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు రావటానికి ప్రధాన కారణం క్రొవ్వు పదార్థాలు తినటం. మల మూత్రం విసర్జన ఆపటం, అధిజ పరిశ్రమ చేయటం, ఎండలో ఎక్కువగా నిలబడటం, మరియు వయసులో వున్న వారికీ రావటం జరుగుతుంది.

సూచ‌న‌లు..
మొటిమలను పిండకండి. గిల్లకండి. ఇలా చేయటం వలన ఎక్కువగా అవుతాయి. చర్మం పైన మచ్చలు పడతాయి. ముఖాన్ని చల్లని నీటితో కడగాలి.

చేయాల్సిన‌వి…

మొటిమలు మరియు మచ్చలు తగ్గటానికి వేడి నీటిలో నిమ్మకాయ రసం వేసి ఎనిమా చేయండి.

రాత్రి పడుకునే ముందు గులాబీ జలం ముఖానికి రాసి పడుకోండి..

ఆయుర్వేద మందులు…

ముఖానికి రాసుకోవటానికి కావాల్సిన ఔష‌ధాలు
1. కుంకుమాది తైలం.
2. ముల్తాన్ మట్టి.
3. గులాబీ జలం
ఈ మూడు ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.