మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆయుధాలు స్వాధీనం!

పోలీసులు భారీ ఛేజ్ చేసి ఆయుధాలున్న‌ కారును ప‌ట్టుకున్నారు.

భోపాల్ (CLiC2NEWS): మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పోలీసులు అక్ర‌మంగా ఆయుధాలు త‌ర‌లిస్తున్న కారును ఛేజ్ చేసి ప‌ట్టుకున్నారు. కానీ నిందుతులు కారు విడిచి పెట్టి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఆగ్రా-ముంబ‌యి హైవేపై ఆయుధాలతో వెళ్తున్న కారును పోలీసులు ఛేజ్ చేసి ప‌ట్టుకున్న‌రు. కారులో 40 పిస్తోళ్లు, 36 మ్యాగ‌జీన్లు, ఇత‌ర ఆయుధ సామాగ్రి ఉన్న‌ట్లు గుర్తించారు. ఇవి విదేశీ ఆయుధాల ఆధునాత‌న అనుక‌ర‌ణ‌లని తెలిపారు. సాధార‌ణ మ్యాగ‌జీన్‌ల‌లో 10 కాట్రిడ్జ్‌లు ఉంటాయి.. కానీ స్వాధీనం చేసుకున్న మ్యాగ‌జీన్‌ల‌లో 30 కాట్రిడ్జ్‌లు నింపొచ్చ‌ని తెలిపారు.

ఆయుధాల త‌ర‌లింపుపై వ‌చ్చిన స‌మాచారంతో పోలీసులు ముందుగా ఇండోర్‌లోని రౌ ప్రాంతంలో ఆయుధాల‌తో ఉన్న కారును అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దీనిని ప‌సిగ‌ట్టి నిందుతులు కారును వేగంగా పోనిచ్చి.. పోలీసుల వాహ‌నాన్ని ఢీకొట్టి,త‌ప్పించుకొని పోయారు. ఇండోర్‌కు 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఖ‌ల్‌ఘాట్ వ‌ద్ద మ‌రో పోలీసు వామ‌నాన్ని, బారికేడ్డ‌ను ఢీకొట్టి పోయారు. చివ‌ర‌కు ఖ‌ర్‌గోన్ జిల్లాలోని స‌నావాడ్ ప్రాంతంలో వాహ‌నాన్ని వ‌దిలి, అడ‌విలోకి పారిపోయార‌ని పోలీసులు వివ‌రించారు. నిందితులు ఎక్క‌డివారో, ఆయుధాల‌ను ఎక్క‌డినుండి తీసుకొచ్చారో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.