క‌లుషిత ఆహారం తిన్న100 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

క‌రీంన‌గ‌ర్ (CLiC2NEWS): జిల్లాలోని చొప్ప‌దండి మండ‌లం గురుకుల పాఠ‌శాల‌లోని సుమారు 100 మంది బాలిక‌లు అస్వ‌స్థ‌త‌కు గురైనారు. పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం తిన్న విద్యార్థినిల‌కు వాంతులు, క‌డుపులో నొప్పి రావటంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారిలో కొంత మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గ‌రౌవ‌డంతో వారిని పాఠ‌శాల ప్రిన్సిపాల్‌ క‌రీంన‌గ‌ర్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. పాఠ‌శాల‌లో మొత్తం 450 మంది విద్యార్థినులు ఉన్నారు. మ‌ధ్యాహ్న భోజ‌నంలో క్యాబేజి, సాంబార్‌, గుడ్లు పెట్టారు. భోజ‌నం చేసిన కొద్దిసేప‌టికే విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైనారు.

Leave A Reply

Your email address will not be published.