ఎపి రైతులంద‌రికీ పంట‌ల బీమా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంద‌రికి పంట‌ల బీమా అమ‌లు చేయాల‌ని స‌బ్‌క‌మిటి స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్ష‌త‌న సోమ‌వారం వ్య‌వ‌సాయంపై ప్ర‌కృతి విప‌త్తుల ప్ర‌భావం అనే అంశంపై మంత్రులు, అధికారుల స‌బ్‌కమిటి స‌మావేశం జ‌రిగింది. విప‌త్తు స‌మ‌యాల్లో రైతుల‌కు న్యాయం జ‌ర‌గాలని స‌బ్ క‌మిటి అభిప్రాయం వ్య‌క్తం చేసింది. గ‌త ప్ర‌భుత్వంలో పంట‌ల బీమా వ్య‌వ‌స్థ‌ను చిన్నాభిన్నం చేశార‌ని మంత్రులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ స‌మావేశంలో మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో పాటు టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.