Hyderabad: రూ. 7కోట్ల విలువైన నగలతో డ్రైవర్ పరారీ

హైదరాబాద్ (CLiC2NEWS): నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఓ డ్రైవర్ 7 కోట్ల రూపాలయల విలువ చేసే ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపిన వివారల మేరకు.. నగరంలోని మాదాపూర్ మైమోం భుజ అపార్ట్ మెంటులో నివాసం ఉంటున్న రాధిక ఆభరణాల బిజినెస్ చేస్తుంటారు. కాగా అదే భవన సముదాయంలో ఉంటున్న అనూష రూ. 50 లక్షల విలువ చేసే ఆభరణాలను ఆర్డరు చేశారు.
శుక్రవారం అనూష మదురానగర్‌లో బంధువుల ఇంట్లో ఉన్నారు. ఆర్డరు చేసిన నగలను అక్కడికే పంపమని చెప్పడంతో రాధిక తన కారులో డ్రైవర్ శ్రీనివాస్, సేల్స్ మెన్ అక్షయ్ తో ఆభరణాలను మధురానగర్‌కు పంపారు. అపార్టుమెంటుకు చేరుకున్నాక డ్రైవర్ కారులో ఉండగా.. అక్షయ్ ఇంటిలోకి వెళ్లి నగలను అనూషకు ఇచ్చి అపార్టు మెంటు బయటకు వచ్చాడు.. ఈ లోగా డ్రైవర్ శ్రీనివాస్ కారుతో సహా పరారయ్యాడు. ఆ కారులో సిరిగిరిరాజ్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్‌కు తిరిగి ఇవ్వాల్సిన కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఈ మేరకు రాధిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసునమోదు చేసి డ్రైవర్ శ్రీనివాస్ కోసం గాలింపు చేపట్టారు.