ఆరు రోజుల్లో రూ. 18 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి!

న్యూఢిల్లీ (CLiC2NEWS): గ‌త ఆరురోజుల్లో ఏకంగా రూ. 18 ల‌క్ష‌ల కోట్ల మ‌దుప‌ర్ల సంప‌ద క‌నుమ‌రుగైంది. దేశీయ దిగ్గ‌జ కంపెనీ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ మార్కెట్ విలువ కంటే ఇది ఎక్కువ. క్రితం వారం మొద‌లుకొని మొత్తం వ‌రుస‌గా ఆరు సెష‌న్లు న‌ష్టాలు కాన‌సాగాయి.

మ‌ర్కెట్ల వ‌రుస ప‌త‌నంతో బిఎస్ ఇలోని న‌మోదిత సంస్థ‌ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ జూన్ 9 నుంచి జూన్ నెల 17 మ‌ధ్య రూ. 236.77 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ. 181.77 ల‌క్ష‌ల కోట్ల‌కు దిగ‌జారింది. శుక్ర‌వారం నాటికి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ. 17.51 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. గ‌త ఆరు సెష‌న్ల‌లో మదుపర్లు కోల్పోయిన సంప‌ద దీనికంటే ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. తీవ్ర ఒత్తిడిలో చ‌లించిన దేశీయ మార్కెట్ సూచీలు ఈ వారం చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌మోదు చేశాయి. 2020 మే నెల త‌ర్వాత అత్య‌ధిక న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్న వారంగా నిలిచింది. సెన్సెక్స్ ఈ వారంలో ఏకంగా 3,959.86 పాయింట్లు (7.15 శాతం) కుంగి 50,921.22 వ‌ద్ద ఏడాది క‌నిష్టానికి చేరింది.

Leave A Reply

Your email address will not be published.