శ్రీ‌లంక‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 420, డీజిల్ రూ. 400

కొలంబో (CLiC2NEWS): శ్రీ‌లంక తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్ర‌జ‌ల‌కు ఇంధ‌న ధ‌ర‌లు చుక్క‌ల్ని చూపిస్తున్నాయి. అస‌లే అనేక ఇబ్బందుల్లో ఉన్న శ్రీ‌లంక లో తాజాగా మంగ‌ళ‌వారం చ‌మురు ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏకంగా లీట‌రు పెట్రోల్ ధ‌ర 24.3 శాతం పెరిగింది. డీజిల్ ధ‌ర 38.4 శాతం పెరిగింది.

తాజాగా పెరిగిన ధ‌ర‌ల మేర‌కు అక్క‌డ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 82 పెరిగిన‌.. ప్ర‌స్తుతం రూ. 420కి చేరింది. రూ. 111 అద‌న‌పు భారం ప‌డ‌టంతో లీట‌రు డీజిల్ కు రూ. 400 చెల్లించాల్సి వ‌స్తోంది. ఈ ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచుతూ సిలోన్ పెట్రోలియం కార్పోరేష‌న్ మంగ‌ళ‌వారం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

అధికంగా పెరిగిన పెట్రో ధ‌ర‌ల నేప‌థ్యంలో ఆటో డ్రైవ‌ర్లు భారీగా టాక్సి వ‌సూలు చేస్తున్నారు. మొద‌టి కి.మీ రుకు ప్ర‌యాణికుడి నుండి రూ. 90 తీసుకుంటామ‌ని, రెండో కిలోమీట‌రు నుంచి రూ. 80 తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.