చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం ప‌దిలం

భారతదేశం ఒక అద్భుతం. భారత దేశంలో మనం పుట్టటం మరో అద్భుతం. మన తల్లితండ్రులు చేసిన పుణ్యాల ఫలితంగా మనం ఈ భారత దేశంలో పుట్టి నాము. ఏ కాలానికి ఆ కాలం చక్కగా ఉంటాయి. ఎండ కాలంలో ఎండలు వర్షాకాలం లో వర్షాలు, చలి కాలంలో చలి ఉంటుంది. ఇప్పుడు మనం చలి కాలంలో వున్నాము కనుక ఈ కాలంలో మనకు రోగాలు రాకుండా ఆహారానియమాలు పాటిస్తే చాలు, అదే విధంగా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవటానికి మనం ఎల్లప్పుడు వ్యాయామం మరియు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఈ కాలంలో వచ్చే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తినాలి.అప్పుడే మనకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.కాలాన్ని బట్టి వచ్చే వ్యాధులు దగ్గరికి రావు.

మనం చలికాలం లో వచ్చే జలుబు, జ్వరం, దగ్గు,గొంతు ఇన్ఫెక్షన్, ఫ్లూ వ్యాధులు రాకుండా మన ఇంటి పెరటిలో పెరిగే తులసి చెట్టు ఆకులను, మరియు ఊసిరి చెట్టు కాయలను వాడుకుంటే చాలు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము.

ఆయుర్వేదాన్ని కూడా మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.

తులసి చెట్టు గురించి. తులసి ఆకులను వాడుట వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాస రోగాలను దూరం చేయటంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. దీనిని వాడటం వలన మానసిక ఒత్తిడి, చింత, శారీరక ఒత్తిడిని తగ్గించటంలో చాలా చక్కగా పనిచేస్తుంది. ఛాతిలో పేరుకోపోయిన కఫాన్ని తగ్గిస్తుంది. ఆంటీ ఆక్సిడెంట్ మరియు ఆంటీ ఇన్ఫెక్షన్ గా పనిచేస్తుంది. Detoxification కూడా చేస్తుంది

దీనిని ఒక గ్లాస్ నీటిలో 4 తులసి ఆకులు,3 మిరియాలు,ఒక ఇలాయిచి, తగినంతగా బెల్లం కలిపి టీ తయారు చేసుకొని ప్రతిరోజు తాగవచ్చును.దీని వలన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

ఊసిరికాయ ని తినటం వలన శరీరానికి చాలా ప్రయోజనాలు వున్నాయి. ఇది ఎండాకాలంలో, వర్షాకాలంలో, చలి కాలంలో కూడా దీనిని తినవచ్చును. దీనిని కన్నడలో ఛత్రిఫల్ అంటారు.ఛత్రి అంటే గొడుగు అని తెలుగులో అంటారు., ఎండకు, వర్షానికి, మంచుకు మన బయటకు పోయినపుడు గొడుగు వేసుకొని పోతాము. దాని వలన మనకు రక్షణ కలుగుతుంది. గొడుగు మన శరీరాన్ని ఎండకు, వర్షానికి, మంచుకు ఎలా రక్షణ కల్పిస్తుందో, అదే విధంగా ఊసిరికాయ తింటే మన శరీరానికి రక్షణ కల్పిస్తూ మనకు ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది.అందుకే దీనిని ఛత్రి ఫల్ అన్నారు.దీనిని తినటం వలన గుండె జబ్బులు, లివర్ జబ్బులు, మస్తీష్క జబ్బులు, తగ్గుతాయి.ఆమ్లలో విటమిన్ సి, ఏమినో ఆసిడ్స్ వున్నాయి., ఎన్నో రకాల జబ్బులు రాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

కనుక మన పరిసర ప్రాంతాలలో ఈ సీజన్లోలో వచ్చే, జామకాయలు, ఊసిరికాయలు, దానిమ్మ, రేగు పండ్లు, సంత్ర, నిమ్మకాయ, ఆపిల్, సీతాఫలం, కివి, అలుబకరా, అరటిపండు, ఇలాంటివి తింటూ వుంటూ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలి కాలంలో వచ్చే పండ్లు, కూరగాయలు, తింటేనే రేపు వచ్చే ఎండాకాలానికి శరీరం తట్టుకుంటుంది. చలికి ఇవే తింటే జలుబు అవుతుంది అని తినకపోతే వచ్చే ఎండాకాలం శరీరం ఎండ వేడికి తట్టుకోదు. మరియు ఇవి తినకపోతే చలికాలం వాతం రోగాలు వస్తాయి. అన్ని నొప్పుల రోగాలు, గ్యాస్, రోగాలు వస్తాయి.

హిత్భూక్, మిత్భూక్, ఋతుభూక్, అంటే హితమైన, పరిమితమైన ఆహారం, కాలాన్ని బట్టి ఆహారాన్ని తీసుకుంటే జబ్బులు రావు.

 

-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.