`ఆదాయం తగ్గిపోయింది.` మంత్రి పదవికి రాజీమా చేస్తా..!
మళ్లీ సినిమాల్లో నటిస్తా: కేంద్ర మంత్రి సురేష్ గోపి
కానూర్ (కేరళ), (CLiC2NEWS): కేంద్ర సహాయ మంత్రి పదవికి నుంచి వైదొలగాలని తాను భావిస్తున్నట్లు మళయాల అగ్రనటుడు సురేష్ గోపి పేర్కొన్నారు. కేరళ నుంచి బిజెపి ఎంపిగా ఉన్న ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కానూర్‌లో బిజెపి కార్యర్తల సమావేశంలో ఆదివారం సురేష్ గోపి మాట్లాడుతూ… సినిమా రంగాన్ని వదలి రాజకీయాల్లో, కేంద్ర మంత్రిగా అవ్వాలని ఏనాడు కోరుకోలేదని అన్నారు. ఇటీవల కాలంలో తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని మీడియాకు తెలిపారు.
ఈ యేడాది ఆరంభంలో రాష్ట్రపతి ముర్ము కన్నూర్ కు చెందిన బిజెపి సీనియర్ నేత సదానందన్ మాస్టర్‌ను రాజ్య సభకు నామినేట్ చేశారని… తన మంత్రి పదవిని సదానందం మాస్టర్ ఇవ్వాలని పేర్కొన్నారు.
Also Read: వైజాగ్‌లో ఎఐ డేటా సెంటర్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన..
[…] `ఆదాయం తగ్గిపోయింది.` మంత్రి పదవిక… […]
[…] `ఆదాయం తగ్గిపోయింది.` మంత్రి పదవిక… […]