రాష్ట్రంలో భారీగా పెరిగిన ఇంజనీరింగ్ ఫీజులు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య మరింత భారంగా మారనుంది. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలలో ఇంజనీరింగ్ ఫీజు లక్ష రూపాయలు పైమాటే. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 79 కాలేజీలు హైకోర్టు నుండి అనుమతి పొందాయిరాష్ట్రంలో మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంజనీరింగ్ ఫీజులను సవరిస్తారు. . ఫీజుల పెంపుపై ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న తరుణంలో కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజుల పెంపునకు హైకోర్టు నుండి అనుమతి పొందాయి.
బిసి, ఇబిసి కోటా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పెంపు ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం విద్యార్థుల తల్లిదండ్రలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు రేపు మొదటి విడత ఇజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. సెప్టెంబర్ 13వరకు మాత్రమే ఫీజు చెల్లింపునకు గడువుంది.