IND vS NZ: టి20 సిరీస్ ఇండయాదే..
మూడో టి 20 టై

నేపియర్ (CLiC2NEWS): న్యూజిలాండ్‌లోని మెక్లీన్ పార్క్ వేదికగా కివీస్, భారత్ మధ్య ఇవాళ జరిగిన ఆఖరి టి20 డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా ముగిసింది.
మూడు టి20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇవాళ జరిగిన మూడో టి20 వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా ముగిసింది. వర్షం భారీగా కురుస్తుండటంతో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు అంపైర్లు, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ న్యూజిలాండ్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కివీస్ మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే అలన్ (3) వికెట్‌ను చేజార్చుకొంది. ఛప్‌మన్‌క (12)తో కలిసి మరో ఓపెనర్ డేవన్ కాన్వే (59) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చాప్‌మన్‌ను సిరాజ్ కౌట్ చేయగానే క్రీజ్‌లోకి వచ్చిన ఫిలిప్స్ (54) ధాటిగా ఆడాడు. దాంతో మూడో వికెట్కు 86 మరుగులు చేశారు. అనంతరం సిరాజ్ (4/17), అర్ష్దీప్ సింగ్ (4/37) విజృంభించడంతో కేవలం 30 పరుగుల వ్యవధఙలో 8 వికెట్లను న్యూజీలాండ్ చేజార్చుకుంది. దాంతో కివీస్ 160 పరుగులకే భారత్ బౌలర్లు కట్టడి చేశారు.
భారత్ బ్యాటింగ్…
అనంతరం బ్యాటింగ్ మొదలెట్టిన ఇండియా ఆదిలో్నే కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (10)తో పాటు రిషబ్ పంత్ (11) సూర్యకుమార్ యాదవ్ స్వల్ప వ్యవధిలోనే ఔటవ్వడంతో భారత్ ఎదురీత మొదలైంది. కెప్టెన్ పాండ్య (30 నాటౌట్) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో 9 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 75 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం కురవడం మొదలవడంతో డక్‌వర్త్ లూయిస్ కింద భారత్ 76 పరుగులు చేస్తే విజయం.. 75 చేస్తే టైగా ముగుస్తుంది. ఇండియా 75 పరుగులు చేయడంతో ఓటమి నుంచి తప్పించుకొంది.
I loved as much as you’ll receive carried out right here. The sketch is tasteful, your authored subject matter stylish. nonetheless, you command get got an nervousness over that you wish be delivering the following. unwell unquestionably come more formerly again since exactly the same nearly a lot often inside case you shield this hike.