India: తగ్గుముఖం పడుతున్న కరోనా.. 3 వేల దిగువకు మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. అలాగే మరణాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కు చేరింది.
దేశంలో కొత్తగా 2,55,287 మంది బాధితులు కరోనా బారిన పడి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి దేశంలో వరకు మహమ్మారి నుంచి మొత్తం 2,59,47,629 మంది బాధితులు కోలుకున్నారు. అలాగే గత 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 2,795 మంది వైరస్ బారినపడి మృతి చెందారని ఆరోగ్యశాఖ చెప్పింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,31,895 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 18,95,520 యాక్టివ్ కేసులున్నాయని బులిటెన్లో పేర్కొన్నారు.