భారత్-చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ..!

తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), (CLiC2NEWS) : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో శుక్రవారం భారత్, చైనా సైనికులు ఘర్షణకు దిగినట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వివాదాస్పద భూభాగంలో డిసెంబర్ 9న యాంగ్‌సే వద్ద ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
వాస్తవాధీనరేఖ సమీపంలోకి చైనా సైనికులు వచ్చిన నేపథ్యంలో ఈ ఘర్షణ నెలకొన్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఘర్షణ జరిగిన వెంటనే, భారత్-చైనా రెండు దళాల మధ్య సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఇరు దేశాల సైనికాధికారులు అక్కడ ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. కాగా వెంటనే ఇరు దేశాల సైన్యాలు ఆ ప్రాంతం నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది.
2020 సంవత్సరంలో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలయ్యారు. ఈ ఘటనలో చైనా సైనికులు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. కానీ చైనా ఎటువంటి ప్రాణనష్టాన్ని ధృవీకరించలేదు. ఈ ఘటనతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లో మళ్లీ ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Pretty! This was a really wonderful post. Thank you for your provided information.