India Corona: ఒక్కరోజే 4,329 మంది బలి
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 18.69,223 లక్షల నమూనాలను పరీక్షించగా 2.63,533 కరోనా పాజివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 4,329గా నమోదైంది.
దేశంలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 4,329 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఒకరోజులో అత్యధికంగా నమోదైన మరణాలు ఇవే కావడం ఆందోళకరంగా మారింది. మరోవైపు, కొత్తగా 2,63,533మంది కరోనా బారినపడ్డారు. 422436 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 2,52,28,996
- మరణాలు: 2,78,719
- యాక్టివ్ కేసులు: 33,53,765
- రికవరీలు: 2,15,96,512