India Corona: కొత్తగా 3,92,488 కేసులు.. 3689 మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఇండియాలో కరోనా సెకండ్ వేవ్‌లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,92,488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,57,457కు చేరింది. తాజా కొవిడ్ బారిన పడి 3689 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు. ఇప్పటి కొవిడ్ బారిన పడి 2,15,542 మంది మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 3,07,865 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం శుభపరిణామంగా చెప్పుకోవాలి. దేశంలో మొత్తం రికవరీ కేసులు 1,59,92,271కి పెరిగాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 33,49,644 గా ఉన్నాయి.