India Corona: కొత్త‌గా 4,12,262 కేసులు

న్యూఢిల్లీ(CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు మ‌రోసారి నాలుగు లక్ష‌లు దాటాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,12,262 మంది క‌రోనాబారిన‌ప‌డ్డారు. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410 దాటాయి. ఇందులో 1,72,80,844 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 35 ల‌క్ష‌ల మార్కును దాటింది. ప్ర‌స్తుతం దేశంలో 35,66,398 మంది బాధితులు క‌రోనా చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3980 మంది వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతులు 23,01,68కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.