India Corona: కొత్తగా 3,11,170 కేసులు.. 4,077 మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య మరోసారి 4 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,11,170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా 4,077 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరింది. 24 గంటల్లో 3,62,437 మంది డిశ్చార్జి అయ్యారని కేంద్రం పేర్కొంది. కాగా ఇప్పటి వరకు దేశంలో 2,07,95,335 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 2,70,284 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు పేర్కొన్నారు.