India Corona: దేశంలో పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. 30వేలలో నమోదవుతున్న కేసులు తాజాగా 40వేలకుపైగా నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే 47% పెరుగుదల కనిపిస్తుంది. మంగళవారం తాజాగా 43,654 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 640 మంది కరోనాతో మృతి చెందగా.. 41,678 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.