India Corona: కొత్తగా 53 వేల కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది.
- తాజాగా 78,190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 2,88,44,199 మంది బాధితులు కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో 1422 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు 3,88,135 మంది కరోనాతో మరణించారు.
- ప్రస్తుతం దేశంలో 7,02,887 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.