ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/IND-VS-NZ.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికకానుంది. ఈ నెల18వ తేదీన జరిగే ఈ మ్యాచ్ ఏర్పాట్లపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడడు అజారుద్దీన్ ఉన్నతాధికారులను కలిసి చర్చించినట్లు సమాచారం. తొలి వన్డే మ్యాచ్ కోసం ఈనెల 13నుండి ఆన్లైన్లో టికెట్లు అమ్మాకాలు జరుగుతాయాని అజారుద్దీన్ ప్రకటించారు.
ఇటీవల ఉప్పల్‌లో భారత్-ఆస్ట్రేలియ మధ్య టి-20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసినదే. ఈ మ్యాచ్ టికెట్ల జారీ విషయంలో జరిగిన గందరగోళం కారణంగా తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూద్దామని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది.