Indian Corona: 2 ల‌క్ష‌ల లోపే కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 1,52,734 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.
తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534కు చేరుకొంది.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 3,128 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనాబారిన ప‌డి 3,29,100 మంది క‌న్నుమూశారు. తాజాగా 2,38,022 మంది క‌రోనా బారినుండి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కోవిడ్ బారిన‌ప‌డి కోలుకున్నవారి సంఖ్య 2,56,92,342కు చేరింది. ప్ర‌స్తుతం 20,26,092 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు కేంద్రం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.