NZ vs IND: రెండవ టి20 మ్యాచ్లో భారత్ విజయం

మౌంట్ మాంగనుయ్ (CLiC2NEWS): ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టి20 మ్యాచ్లో 65 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయం సాధించింది. టీమ్ ఇండియా 6 వికిట్ల నష్టానికి 191పరుగులు సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెవీస్ 126 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
భారత ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ (111*) సెంచరీ సాధించాడు. 49 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఇషన్ కిషన్ 36, శ్రేయస్ అయ్యర్ 13, హార్దిక్ పాండ్య 13, రిషబ్ పంత్ 6 పరుగురు సాధించారు. దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ గోల్డెన్ డక్ ఔట్ అయ్యారు. మూడు టి20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడవ మ్యాచ్ నవంబర్ 22న జరగనుంది.
Some truly choice posts on this web site, saved to fav.