ఫినాయిల్ తాగి అస్వ‌స్థ‌త‌కు గురైన ఐదుగురు గురుకుల విద్యార్థులు

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): ములుగు జిల్లాలోని మ‌హాత్మా జ్యోతిరావుపూలే బిసి గురుకుల పాఠ‌శాల‌లోని ఐదుగురు విద్యార్థులు ఫినాయిల్ తాగి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. పాఠ‌శాల ప్ర‌ధానాధ్యాప‌కులు తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం.. బిసి గురుకుల పాఠ‌శాల‌లో ఆదివారం ఉద‌యం అల్పాహారం చేస్తున్న‌ స‌మ‌యంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువున్న విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. వారిలో ఐదుగురు విద్యార్థులు మ‌న‌స్తాపంతో ఫినాయిల్ తాగారన్నారు. ఈ విష‌యాన్ని గొడ‌వ‌పడిన విద్యార్థినులు కొంత మంది ప్రిన్సిపాల్‌కు తెలియ‌జేయ‌టంతో హుటాహుటిన ఎంజిఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు వారికి చికిత్సనందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఐదుగురు విద్యార్థినుల ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.