మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): బోనాల ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఆ నిధులతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.