ఇన్ఫోసిస్: కర్ణాట‌క పోలీసులకు రూ. 33 కోట్ల విరాళం

బెంగ‌ళూరు (CLiC2NEWS): దేశీయ ఐటి దిగ్గ‌జం ఇన్ఫోసిస్ క‌ర్ణాట‌క పోలీసుల‌కు భారీ విరాళం అంద‌జేసింది. సైబ‌ర్ నేరాల‌పై పోరాడుతున్న సైబ‌ర్ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ సామ‌ర్ధ్యాన్ని బ‌లోపేతం చేసేందుకు వీలుగా రూ. 33 కోట్లు మంజూరు చేసి దాతృత్వాన్ని చాటుకుంది. ఈ విష‌యాన్ని ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ సిఎస్ ఆర్ విభాగం బుధ‌వారం తెలియ‌ప‌రిచింది.

బెంగ‌ళూరులోని సిఐడి ప్ర‌ధాన కార్యాల‌యంలో సెంట‌ర్ ఫ‌ర్ సైబ‌ర్ క్రైం ఇన్వెస్టిగేష‌న్ అండ్ రీసెర్చి (CCITR) స‌హ‌కారాన్ని పున‌రుద్ద‌రించేందుకు వీలుగా సిఐడి, డేటా సెక్యూరిటి కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DSCI) తో చేసుకున్న ఎంఒయుపై సంతాకాలు చేసిన‌ట్లు స‌మాచారం. CCITRతో అనుబంధాన్ని మ‌రో నాలుగేళ్లు పాటు పొడిగించ‌డం ద్వారా సైబ‌ర్ నేరాల్లో ద‌ర్యాప్తు సామ‌ర్ధ్యం మ‌రింత బలోపేతం అవుతుంద‌ని ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.