TS: రేపు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రేపు (సోమవారం) ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల ఏయనున్నారు. కరోనా సెకండ్ వేవ్ మూలంగా
ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను రాష్ట్ర సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫలితాల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే.
మొదటి సంవత్సరం ఆయా సబ్జెక్టులో వచ్చిన మార్కులను రెండో సంవత్సరంలోనూ కేటాయించారు. ప్రాక్టికల్స్‌లో వంద శాతం మార్కులను కేటాయించారు. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 మార్కులను ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ రెండో సంవత్సరం సుమారు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు పూర్తి చేశారు. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
Good disheejan
Good diseejan