జూన్ 28న ఇంటర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈనెల 28వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించింది. మే 6వ తేదీన ఇంటర్ పరీక్షలు మే 24వ తేదీ వరకు జరిగినవి. ఈ సంవత్సరం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.