AP: ఆగస్టు 16నుండి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈ నెల 16 నుంచి రెగ్యలర్ క్లాసులు జరపాలని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. జూలై 12వ తేదీ నుండి విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. వీరికాఇ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది.