మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం: అవగాహన సదస్సు

జైపూర్ (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేర‌కు జూన్ 26న‌ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గంజాయి మరియు మత్తు పదార్దాలు, మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్ పై అవగాహనా సదస్సు కార్యక్రమం నిర్వహి౦చారు.  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జైపూర్ ఎసిపి జి నరేందర్ మాట్ల‌డుతూ.. గంజాయి మరియు మత్తు పదార్దాలు, మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్ నిర్మూలన కొరకు ప్రజలు అందరూ సహకరించాలని అన్నారు. సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, స్నేహితులు ఎప్పటికప్పుడూ వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లతే వాటి బారి నుంచి  కాపాడవచ్చన్నారు.

ఎవరైన గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు, సమాచారం అంధించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.

సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతూ.. దేశంలో సాంకేతిక రంగంలో ఉద్యోగం వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యాపారులు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పలు రకాల ఆర్థిక లావాదేవీలపై కన్నేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాటిని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, 1098 డయల్ 100, 112 లకు సైబర్ నేరాల బాదితులు పిర్యాదు చేయండి. బాదితులు ఏలాంటి భయాందోళన లేకుండా నేరుగా పిర్యాదు చేస్తే సత్వరమే న్యాయం చేస్తాం.

ఈ సందర్భంగా జైపూర్ పోలీసులు వేలాల, పౌనూరు గ్రామాల యువతకు 2 క్రికెట్ కిట్లను జైపూర్ ACP జి నరేందర్, శ్రీరాంపూర్ CI బి రాజు, జైపూర్ ఎస్సై రామకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై రామకృష్ణ, చైల్డ్ లైన్ డైరెక్టర్ ఆంటోనీ, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, జైపూర్ పోలీస్ సిబ్బంది మరియు వేలాల గ్రామ సర్పంచ్ ప్యాగ శ్యామల-లక్ష్మణ్, ఉపసర్పంచ్ నగేష్, పౌనూర్ సర్పంచ్ సారయ్య, వేలాల, పౌనూర్ గ్రామ యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.