ఇంట‌ర్నేష‌న‌ల్ యోగా డే స్పెష‌ల్‌..

”ప్రియమైన యోగా సాధకులంద‌రికీ న‌మ‌స్కారం.. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం. కావున అంతర్జాతీయంగా జరుపుకునే యోగ కార్యక్రమంలో అందరు పాల్గొని యోగ యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయాలని కోరుతున్నా.. ఈ వ్యాసం ద్వారా వీక్ష‌కుల‌కు నిత్య‌జీవితంలో యోగా ప్రాధాన్య‌త‌ను వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నా.”     -మీ యోగా మాస్టర్ బాహార్ అలీ


యోగా ప్రాధాన్య‌త‌ను గురించి తెలుసుకుందాం..

“యోగేన చిత్తస్య పదేనా వాచం
మలం శరీరస్య చవైద్యకేనా యోపాకరోత్తం ప్రవరం మునినాం
పతంజలిం ప్రాంజలి రానాతోష్మి”

మానసిక కల్మషములను యోగము ద్వారాను, వాగ్దోషములను వ్యాకరణము ద్వారాను, శారీరక రుగ్మతలను ఆయుర్వేదం ద్వారాను తొలగించిన ముని శ్రేష్టుడు పతంజలికి ముఖళిత హస్తములతో నా నమస్కృతులు నందజేయుచున్నాను.

యోగం అనేది ఒక పూర్ణ విజ్ఞానం, యోగ అంటే ఒక పూర్ణ చికిత్స పద్ధతి, ఒక పూర్ణ జీవనశైలి, ఒక పూర్ణ ఆధ్యాత్మిక విద్య అయి వున్నది. యోగ రహస్యం ఇది. లింగం, జాతి, వర్గం, భాష, సంప్రదాయం, క్షేత్రం, మరియు భాషభేదముల యొక్క సంకిర్ణత్వంతో బందిచబడలేదు. సాధకులు, యోగులు, మునులు, ఋషులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు, అందరూ దీనిని సాధ‌న చేయ‌వ‌చ్చు. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు.


పాద హస్తాసనము 

చేయు విధానము నిలువుగా నిలబడి శ్వాసను లోపలి నింపుకొనుచు హస్తములు పైకి లేపి ఉంచి తిరిగి శ్వాసను వదులుతూ పొట్టను లోపలికి లాగుతూ ముందుకు వంగిపొము, తలను మోకాళ్ళ మధ్య నుంచుము హస్తములను వెనుక పిక్కల ప్రక్కవైపు నుంచవలెను.ఇలా 10 సెకనులు ఉంచి తరువాత శ్వాసను తీసుకుంటూ చేతులను పైకి లేపి, తిరిగి శ్వాసను విడుస్తూ చేతులను మాత్రమే కిందకు దించాలి.ఇలా మూడు సార్లు చేయాలి.

ప్రయోజనాలు: వెన్నుముకను సడలించును. వెన్ను నొప్పి ని తొలగించును. తొడ భాగములను శక్తిమంతము చేయును.మలబద్దకం నివారించును. స్త్రీల యందు ఋతు సంబంధమైనటువంటి దోషములను చక్కబరుచును.


అర్థ చక్రాసనము

ముందుగా రెండు పాదాలు దగ్గర కలిపి ఉంచి నిటారుగా నిలబడవలెను వీపును నడుము వద్ద అరచేతులతో పట్టి ఉంచి ఊపిరిని వదులుము.
ఊపిరి పీల్చుతూ నడుము భాగమును వెనుకకు ఉంచుము మెడ కండరములను సాగదీయుచు తల వెనుకకు వంచాలి. ఊపిరిని సాధారణంగా పీల్చుచు ఒక నిమిషం ఈ స్థితిలో ఉండి.. తిరిగి శ్వాసను విడుస్తూ యథాస్థితికి రావలెను. ఇలా మూడుసార్లు చేయవలెను.


ప్రయోజనాలు వెన్నుముకను సులువుగా ఒంగునట్లు చేయను. వెన్నునందు నరములు చలింపజేయును తలలోని రక్తప్రసరణను అధికముగా చేయును.


త్రికోణాసనము

చేయు విధానము:  కుడి పాదమును ఎడమ పాదము నుండి ఒక మీటర్ దూరమున ఉంచవలెను రెండు చేతులను నెమ్మదిగా ప్రక్కలకు సమానమైన స్థితిలోనికి వచ్చువరకు పైకి ఎత్తుము. ఊపిరి పీల్చుము.

చేతులు రెండు ఒకే వరుసలో ఉంచి కుడి ప్రక్కకు వంగుము. కుడి చేతి కుడి పాదమును తాకవలెను. ఎడమచేయి తిన్నగా పైనుండును. ఎడమ అరచేయి ముందుకు తిరిగి ఉండాలి. ఎడమ చేతి వేళ్ళ వైపు చూడుము.

ఇలా 15 సెకండ్ల వరకు ఉండి తిరిగి శ్వాసను తీసుకుంటూ యధాస్థితికి రావలెను. ఇలానే ఎడమ చేతి వైపు కూడా చేయవలెను.

ప్రయోజనాలు
పిక్కలను,తుంటి కండరములను ముష్టికరము చేయును వీపునొప్పిని నివారించును.గూనిని చక్కబరుచును. చదునుగానున్న పాదమును చక్కగా జేయుటలో ఉపయోగపడుతుంది.


 

దండాసనం

చేయు విధానం-
కూర్చుని చేసే ఆసనాలన్నిటికీ దండాల స్థితిలో ప్రారంభించడం జరుగుతుంది. రెండు పాదాలు కలిపి నిటారుగా కూర్చునవలెను నడుమునకు రెండు వైపులా అరచేతులు భూమిపై ఆనించి అంగుళములను వెనుక వైపునకు ఉంచి చేతులు మరియు నడుమును చక్కగా ఉంచవలెను.

 

ప్రయోజనాలు: మోకాళ్ళ నొప్పులకు సయాటికకి చాలా చక్కగా పనిచేస్తుంది


 

భద్రాసనము

చేయు విధానము..

ముందుగా నేలపై కూర్చుని రెండు కాళ్ళ యొక్క అరి పాదాలను ఒకదానితో ఒకటి ఆనించి, రెండు చేతులతో రెండు కాళ్ల యొక్క వేళ్ళని పట్టుకొని, తుమ్మెద ఏ విధంగా తన రెక్కలతో శరీరాన్ని ఎత్తుకు పోతుందో అదే విధంగా మనము మోకాళ్ళని కిందికి పైకి రెక్కలు లాగా ఊపవలెను. ఇలా ఒక 15 సెకండ్ల వరకు చేయవలెను.


ప్రయోజనాలు: మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. సయాటిక నొప్పి తగ్గుతుంది. తొడ కండరాలు కూడా తగ్గుతాయి. ఎనుక వైపు పెరిగిన హిప్స్ కూడా చాలా చక్కగా కొవ్వొత్తిలా కరిగిపోతాయి. ఏకాగ్రత లెక్కించుతుంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది.


 

అర్థ ఊష్ట్రాస‌నం

చేసే విధానం.
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. కాలి ముడుపులను భుజాలకు సమాంతర దూరంలో ఉంచాలి. ముడుపుల మీద లేవాలి వెనుక నుండి రెండు కాళ్లు సమాంతరంగా ఉండాలి. కాలి వేళ్ళు భూమి మీద ఆనించి ఉంచాలి. నాలుగు వేళ్ళు కలిసేటట్లు నడుము మీద ఆంచాలి. నాలుగు వేళ్ళు నాభి వైపు ఉండాలి. శ్వాసను నింపుతూ మెడను మెల్లగా వెనుకకు వంచాలి. రెండు చేతులని కట్టుకొని ముందు ఛాతిపై ఉంచవలెను. శ్వాసను మామూలుగా తీసుకోవాలి.
యధాశక్తి ఆగాలి. తిరిగి శ్వాసని విడుస్తూ ఏదాస్థితికి రావాలి.
వెనక్కు వస్తున్నప్పుడు జాగ్రత్తగా మెల్లమెల్లగా రావాలి లేకపోతే తల తిరిగే ప్రమాదం ఉంది తొందరపడకుండా నిదానంగా చేయాలి.


ప్రయోజనాలు: మహిళలకు తలెత్తే మృతుశ్రవ సమస్యలన్నీ దీనివల్ల దూరం అవుతాయి. గుండె బలపడి రోగాలు రాకుండా ఉంటాయి. శారీరక వికాసం తో పాటు పొడవు పెరగడానికి కూడా ఇది సహాయకారిగా అవుతుంది. అందుకే యువతి యువకులు తప్పనిసరిగా దీన్ని ఆచరించాలి తొడలు పొట్ట ఛాతి లోపల భాగాలు లాగబడి ఆరోగ్యంగా ఉంటాయి. అధికంగా ఏర్పడు కొవ్వు కరిగిపోతుంది.
వెన్నులో తలెత్తే దోషాలన్నీ వంకరగా నడవడం స్లిప్ డిస్క్ స్పాండిలిటీస్ వంటివి నయమవుతాయి.


పవనముక్తాసనము

చేయు విధానం: చక్కగా పరుండి కుడికాలు మోచిప్పను ఛాతికి ఆనించవలెను.
రెండు చేతి వేళ్ళను ఒకదానియందు మరొకటి కలిపి వేయుచు మోకాలు చిప్పపై ఉంచవలెను. శ్వాసను బయటకు తీయుచు మోకాలు ని నదిమినట్లు పక్షముపై నుంచవలెను. మరియు శిరమును లేపుచు మోకాళ్లతో ముక్కులు స్పర్శించవలెను. ఇలా 15 సెకండ్ల వరకు ఉంచి.. తిరిగి శ్వాసను బయటకు నిలిపివేయుచు దిగువ స్థితి యందు ఉంచుచు మరల పాదమును చక్కగా నుంచవలెను. ఇలా మూడు నుంచి ఐదు సార్లు చేయవలెను ఇదే విధంగా రెండో పాదంతో చేయవలెను.
మరలా తిరిగి రెండు పాదాలు కలిపి ఈ అభ్యాసాన్ని చేయవలెను రెండు కాళ్లు పట్టుకొని నడుమును నేల పై ముందుకి వెనక్కి రోల్ చేయవలెను.. తర్వాత కుడివైపుకి ఎడమవైపుకి రోల్ అవుతూ చెయవలెను. ఇలా ఐదు నుంచి ఆరుసార్లు చేయవలెను.

ప్రయోజనాలు:
స్త్రీ రుతుసం సంబంధించినటువంటి వ్యాధులన్నీ తగ్గుతాయి.
ఆమ్లపితము గుండె రోగములు, కీళ్ల రోగములు నడుము నొప్పి దగ్గులు మరియు పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కూడా తగ్గును మరియు గ్యాస్ కూడా తగ్గుతుంది.
నడుము నొత్తునట్లయితే దీన్ని యోగాచార్య ఆధ్వర్యంలో నేర్చుకోవలెను.


శశకాశనము

చేయు విధానం..

వజ్రాసనంలో కూర్చొని శ్వాసను నింపుకొనుచు రెండు చేతులు పైకి లేపుము. ముందుకు వంగుతూ శ్వాసను బయటకు విడిచిపెట్టి పొట్టని లోపలికి లాగా వలెను. హస్తములను ముందు చాపుచూ అరచేతులను క్రిందికి ఉంచుతూ చేతులను భూమిపై మోపవలెను నొసలు కూడా భూమిపై మోపవలెను. ఈ స్థితిలో ఒక 15 సెకండ్ల వరకు ఉండవలెను. తిరిగి చేతులని పైకి లేపుతో నిదానంగా శ్వాసను తీసుకుంటూ యధాస్థితికి రావలెను. తరువాత శ్వాస విడుస్తూ పూర్వపు స్థితికి ఉండవలెను.


ప్రయోజనాలు
ప్రేగులు, మరిము మూత్రపిండములకు పొట్టకు బలం ఇచ్చును.
మానసిక వ్యాధులను తగ్గించును.
స్త్రీ గర్భాశయ సంబంధించిన జబ్బులు తగ్గించును.మరియు పొట్ట నడుము నడుము ప్రక్కన క్రొవ్వును తగ్గించును.


వక్రాసనము

చేయు విధానం..
ముందుగా దండాసనంలోని కూర్చోవలేను. కుడి కాలును మడుచుకొని ఎడమ తొడ వద్ద ఆనించి నుంచుము. ఎడమ కాలును చక్కగా దండాసనంలో ఉంచవలెను
ఎడమ చేతిని కుడి పాదము మరియు ఎడమ దిశ పొట్ట మధ్యకు తెచ్చి పాదమును వద్ద నిలిపి ఉంచుము.
కుడి చేతిని నడుము వెనుక భూమిపై చక్కగా ఉంచుము. మెడ కుడి వైపుకు తిప్పుకొని చక్కగా చూడుము. కుడి చేతిని నిటారుగా ఉంచుము.
దీన్ని మూడు నుంచి ఐదు సార్లు వరకు చేయవచ్చును.
ఇదేవిధంగా రెండో వైపు కూడా చేయవలెను.


ప్రయోజనాలు.
నడుము యొక్క క్రొవ్వును తగ్గించును. కాలేయము మరియు లాభం కలిగించును.


 

మకరాసనం

చేయు విధానం
పొట్టపై పడుకోవలెను రెండు చేతుల మోచేతులను స్టాండుగా నోనర్చుచు అరచేతులను గదువ, l(గడ్డం) కింద ఉంచవలెను పక్షములు పైకి లేపవలెను.పైన మోచేతులను, కింద పాదములను కలిపి ఉంచవలెను
ఇప్పుడు శ్వాసను నింపుకొనుచు పాదములను క్రమంగా మొదట ఒక్కొక్క పాదములు మరియు తరువాత రెండు పాదములను ఒకేసారి కలిపి మడుచుకొనవలెను మడుచుకున్నప్పుడు పాదముల మడుములను బిరుదులకు ఆనించవలెను శ్వాసను బయటకు వదులుతూ కాళ్ళను చక్కగా నుంచవలెను ఈ విధంగా కనీసం 15 సార్లు చేయవలెను.

 

ప్రయోజనాలు: స్లిప్ డిస్క్, సర్వైకల్ స్పాన్డులైటిస్ మరియు సయాటికకు ఇది లాభకారిగా ఉండును. ఊపిరితిత్తుల సంబంధించినటువంటి ఆస్తమా జబ్బులు తగ్గును. మోకాళ్ళ నొప్పులు ఉన్న చాలా చక్కగా తగ్గును.


కందరాసనం

చేయు విధానం

ముందుగా చక్కగా పరుండ వలెను.
రెండు మోకాళ్ళని ఉంచి ఉంచుము కటిక ప్రదేశం ను పైకి లేపి రెండు చేతులను మోచేతుల బలమున లేపి ఉంచి నడుము క్రింద ఉంచుము.

ఇప్పుడు నడుమును స్థిరంగా నుంచి పాదములను చక్కగా ఉంచుము భుజము మరియు శిరమును భూమిపై ఉంచుము.ఇలా ఐదు నుంచి ఆరు సార్లు చేయవలెను
తిరిగి యదాస్థితికి వచ్చినప్పుడు పిరుదులు మరియు పాదములను నెమ్మది నెమ్మదిగా భూమిపై అనించుము. హస్తములను ఒకేసారి నడుము నుండి వదలవద్దు శవాసములోని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవలేను.

ప్రయోజనాలు

స్లీప్ డిస్క్ మరియు మెడ నొప్పులు ఉదర రోగములకు చాలా చక్కగా లాభంగా ఉండును.
కందరాసనాన్ని సేతు బందాసనం కూడా అంటారు చక్రాసనం వేయని వారు ఈ ఆసనాన్ని చక్కగా వేయవచ్చును.


భుజంగాసనం

చేయు విధానం: ముందుగా పొట్టపై పడుకోవాలి హస్తములను అరచేతులను భూమిపై ఆనించుచు హస్తములను పక్షమునకు రెండు వైపులా నుంచి మోచేతులను పైకి లేపి ఉంచి, మరియు భుజములకు తగిలినట్లుగా ఉండవలెను.
కాళ్లు చక్కగా చాచి ఉంచి పాదములను కలిపి ఉంచవలెను. పాదాలను వెనక వైపు భూమికి ఆ నుంచి ఉంచవలెను.
శ్వాసనం లోపల నింపుచు రొమ్ము మరియు శిరమును మెల్ల మెల్లగా పైకి లేపవలెను. నాభికి వెనుక భాగము భూమిపై అనించి ఉంచవలెను. ఈ స్థితి సుమారు 15 సెకండ్లు ఉంచవలెను. తరువాత శ్వాస విడుస్తూ యధాస్థితికి రావలెను.

ప్రయోజనాలు: సర్వికల్ స్పాండిలైటిస్ మరియు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తగ్గించును. సమస్త మేరు దండం యొక్క రోగములు తగ్గును.


విశ్రాంతి కోసం వేసే ఆసనం

దీనిని యోగ నిద్ర అంటారు.

వీపును ఆధారంగా చేసుకుని పరుండవలెను. రెండు పాదములు మధ్య సుమారు ఒక అడుగు దూరం ఉంచబడును మరి రెండు చేతులు కూడా తొడల దూరంగా చాచి ఉంచవలెను, హస్తములను అరచేతులను కొంత పైకి లేపి ఉంచుము. కన్నులు మూసి ఉంచి మెడను చక్కగా ఉంచి శరీరమంను శవాకారములో బిగుతా లేకుండా ఉంచగలరు. నెమ్మది నెమ్మదిగా 4,5 శ్వాసలు దీర్ఘంగా నింపుకొంచు వదలవలెను. ఇప్పుడు మనసు ద్వారాను శరీరం యొక్క ప్రతిభాగమును చూసినట్లు సంకల్పం ద్వారా ఒకొక్క అవయమునకు బిగుతూ లేకుండా ఉంచవలెను. జీవితం యొక్క సకల కార్యములలో మహా ఉద్దేశముల సఫలత వెనుక సంకల్పశక్తి ముఖ్యంగా నుండును ఇప్పుడు మనము శరీరం అంతటికి పూర్ణ విశ్రాంతి ఇవ్వవలసి ఉండును.ఇందు కొరకు కూడా శరీరం యొక్క విశ్రాంతి మరియు సిదిలీకరణం యొక్క సంకల్పం మొనర్చవలసి ఉండును.

మానసిక ఒత్తిడి, హై బిపి,హృదయరోగాలకు సర్వోన్నతమైనది.ఈ వ్యాధులు కలవారు ఆసనాలు నియమతంగా చేయవలెను.
స్నాయుల దుర్భలత్వం, అలసిపోవుట, చింతములు, మరియు దీని ఆచరణ వలన తొలగిపోవును.

శరీరము, మనసు, మస్తిష్కము మరియు ఆత్మ పూర్ణ విశ్రమము, శక్తి, ఉత్సాహము, ఆనందములు లభించగలవు.

ధ్యానస్థితి వికాసం నొందును. ఈ ఆసనం వేయునపుడు మధ్య మధ్యలో శవాసనం చేయటం వల్ల కొద్ది సమయం నందు శరీరం యొక్క బడలిక తొలగిపోవును.

-షేక్ బార్ అలీ
యోగాచార్యులు

Leave A Reply

Your email address will not be published.