27న న‌గ‌రంలో ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ్రేట‌ర్ ప‌రిధిలో గురువారం ప‌లు చోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నుంద‌ని జ‌ల‌మండ‌లి అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  నగ‌రంలోని లింగంప‌ల్లి నుంచి బోర‌బండ వ‌ర‌కు ఉన్న 800 ఎంఎం డ‌యా పీఎస్‌సీ పైపులైన్ స్థానంలో కొత్త‌గా 800 ఎంఎం డ‌యా ఎంఎస్ పైప్‌లైన్ వేయాల‌ని జ‌ల‌మండ‌లి నిర్ణ‌యించింది. గురువారం (27.01.2022) ఉద‌యం 6 గంటల నుండి మరుసటి రోజు శుక్ర‌వారం ఉద‌యం 6 గంటల వరకు ఈ పనులు కొనసాగుతాయి కాబ‌ట్టి బోర‌బండ రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నుంది. శ‌నివారం (28.01.2022) నాడు నిర్ణీత స‌మ‌యం కంటే ఆల‌స్యంగా నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 6, 9: బోర‌బండ‌, అల్లాపూర్‌, గాయ‌త్రిన‌గ‌ర్‌, ప‌ర్వ‌త్‌న‌గ‌ర్‌, వివేకానంద‌న‌గ‌ర్‌, ఎస్‌పీఆర్ హిల్స్‌, శ్రీరామ్‌న‌గ‌ర్‌, క‌రీంన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాలో అంతరాయం క‌లుగుతుంది. కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.

Leave A Reply

Your email address will not be published.