హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ (CLiC2NEWS) : హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-3 యాచారం వద్ద 2375 ఎంఎం డయా ఎమ్మెస్ పంపింగ్ మెయిన్ పైపులైన్ కు ఏర్పడిన లీకేజీ మరమ్మతు పనులు చేపడుతున్నారు. కావున బుధవారం ఉదయం 8 గంటల నుండి మరుసటి రోజు గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి.
కాబట్టి ఈ 24 గంటలు క్రింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – BN రెడ్డి నగర్, ఎల్బీ నగర్, ఆటో నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, అల్కాపురి, దిల్ సుఖ్ నగర్, RGK
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బండ్ల గూడ.
3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం.14 – ఉప్పల్, బీరప్పగడ్డ, స్నేహపురి, కైలాసిగిరి, బొడుప్పల్.
4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 16 – మైలార్దేవ్ పల్లి, మధుబన్,PDP, హైదర్ గూడ, రాజేంద్ర నగర్, ఉప్పర్ పల్లి, సులేమన్ నగర్, MM పహడి, అత్తాపూర్, చింతల్ మెట్, గోల్డెన్ హైట్స్.
5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6 – ప్రశషన్ నగర్, జూబ్లీహిల్స్, తట్టిఖాన.
6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 3 – మెహదీపట్నం, కార్వాన్, లంగర్ హౌస్, కాకతీయ నగర్, హుమాయన్ నగర్, తాళ్ల గడ్డ, అసిఫ్ నగర్, MES, షేక్ పేట్, ఓయూ కాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయ్ నగర్ కాలనీ.
7.ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 4 – జియాగూడ, అల్లాబండ.
8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం.1 – శాస్త్రిపురం.
9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 15 – మాదాపూర్.
10. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బొడుప్పల్, చెంగిచెర్ల, మల్లికార్జున నగర్, చాణిక్యపురి.
11. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 7 – లాలపేట్.
12. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 11 – మౌలాలి.
13. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 18 – మణికొండ, గంధంగూడ, నార్సింగి
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జలమండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.