4,5 తేదీల్లో నగరంలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ (CLiC2NEWS): మహా నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ -2, రింగ్ మెయిన్-2కి సంబంధించి 1600 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ కు జంక్షన్ పనులు జరగాల్సి ఉంది.
ఎస్ఆర్డీపీలో భాగంగా బైరామల్ గూడ జంక్షన్ వద్ద జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా ఈ పనులు చేపట్టనున్నారు. దీని వలన 4వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు 30 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలియజేశారు. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాలలో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
ఎన్‌పీఏ, బాలాపూర్, మైసారం, బార్కాస్, మేకలమండి, భోలక్ పూర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతంనగర్, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటో నగర్, అల్కాపురి, మహీంద్రా హిల్స్, ఏలుగుట్ట, రామాంతపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్ప గడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం.
పాక్షికంగా.. బోడుప్పల్, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.
Hocam detaylı bir anlatım olmuş eline sağlık